IPL 2021 : ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేక Match లు సరిగా ఆడలేకపోయిన David Warner || Oneindia Telugu

2021-06-03 306

IPL 2021: David Warner reunited with his family on May 31, After that David Warner recalls his IPL 2021 Campaign Amid COVID19 Crisis
#IPL2021
#DavidWarner
#SunrisersHyderabad
#DavidWarnerrecallsIPL2021Campaign
#SRH
#IPL2021InUAE
#BCCI
#COVID19Crisis
#Australiaplayers

ఐపీఎల్ 2021 సీజన్ జరుగుతున్న సమయంలో భారత్ లో కనిపించిన దృశ్యాలు కలచివేశాయని సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందిపడటం, శ్మశానాల్లో తమ కుటుంబసభ్యుల అంతిమ సంస్కారాలు చేసేందుకు జనాలు క్యూ కట్టడం లాంటి సంఘటనలు తనను బాధించాయని పేర్కొన్నాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన బీసీసీఐ.. చివరకు ఆటగాళ్లకు వైరస్ సోకడంతో నిరవధికంగా వాయిదా వేసింది. లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు త్వరగానే తమ ఇళ్లకు చేరుకున్నా.. ఆసీస్ ప్లేయర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.